గురువారం కళ్యాణ్ ఫౌండేషన్ సొసైటీ ఆధ్వర్యంలో రామకుప్పం మండలంలోని గెర్నిపల్లి గ్రామంలో పేద ముస్లిం మహిళలకు బక్రీద్ పండుగ పురస్కరించుకుని నూతన చీరలను చైర్మన్ డా. ఎం. పవన్ కళ్యాణ్ వితరణ చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కళ్యాణ్ ఫౌండేషన్ పేద విద్యార్థులకు కావాల్సిన విద్యా సామాగ్రిని వితరణ చేస్తోంది అని అన్నారు. అదే విధంగా ఈరోజు బక్రీద్ సందర్భంగా 10 మంది మహిళలకు నూతన చీరలను అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, సభ్యులు నవీన్, శివ మరియు అశోక్ పాల్గొన్నారు.