టమాటా ధర కిలో రూ.100కు పైనే పలుకుతుండడంతో ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఈ ప్రక్రియను మార్కెటింగ్ శాఖకు అప్పగించింది. టమాటాలను రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లోని రైతు బజార్లలో కిలో రూ.50కే విక్రయించేలా చర్యలు తీసుకుంటోంది. దీని కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు.