తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి గట్టి షాక్ తగిలింది. ఆయనను మంత్రి పదవినుంచి బర్తరఫ్ చేస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఆదేశాలు జారీ చేశారు. మనీ లాండరింగ్ కేసుతో పాటు వివిధ కేసుల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్నారని బర్తరఫ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సెంథిల్ బాలాజీ జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ విషయంపై స్పందించిన అక్కడి సీఎం స్టాలిన్.. గవర్నర్ చర్యలపై న్యాయపోరాటం చేస్తామంటున్నారు.