జులై 1 నుండి పట్టణ ప్రాంతాల్లోని రేషన్ దుకాణాల్లో దశల వారీగా గోధుమ పిండి పంపిణీ చేస్తామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. పుంగనూరు నియోజకవర్గం నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. చిరుధాన్యాలను ప్రోత్సహించేలా రాయలసీమలో పైలెట్ ప్రాజెక్టు కింద రాగులు, జొన్నలు అందిస్తామని తెలిపారు. చిరుధాన్యాల కొనుగోళ్లలో దళారీ వ్యవస్థను నిర్మూలిస్తామని తెలిపారు.