గోఫస్ట్ ఎయిర్ లైన్స్ సంస్థ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. కాగా, తమ విమానాల సర్వీసుల రద్దు పొడిగిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. జులై 6 వరకు విమాన సర్వీసుల రద్దును పొడిగిస్తున్నట్లు తెలిపింది. మే 1వ తేదీ నుండి విమాన సేవలను రద్దు చేసిన గో ఫస్ట్, ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించింది. తాజాగా, కార్యనిర్వాహక కారణాలతో జులై 6 వరకు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.