జీరో బేస్డ్ టైంటేబుల్లో భాగంగా ఎక్స్ ప్రెస్ రైళ్లకు గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో తొలగించిన స్టాపేజ్ లను రైల్వేబోర్డు క్రమక్రమంగా పునరుద్ధరిస్తోన్నది. నెంబరు. 12603 చెన్నై సెంట్రల్ హైదరాబాద్, నెంబరు. 12733 తిరుపతి-లింగంపల్లి నారాయణాద్రి, నెంబరు. 17015 భువనేశ్వర్-సికింద్రాబాద్ విశాఖ, నెంబరు. 17232 నాగరసోల్-నరసపూర్ ఎక్స్ ప్రెస్ లకు మిర్యాలగూడ, నల్గొండలో నిలుపుదలని పునరుద్ధరించేందుకు బోర్డు సమ్మతించింది.