తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో సభ్యులుగా ఉంటూ అనారోగ్యం కారణంగా పనులకు వెళ్లలేని కార్మికులకు గుడ్ న్యూస్ తెలిపింది.వీరికి సంవత్సరానికి రూ.12వేలు చొప్పున మూడేళ్ల వరకూ ఆర్థిక సాయం అందించనున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.