మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐకి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ఇవాళ్టితో పూర్తి కానుంది. అయితే కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చిందా? లేక సుప్రీంకోర్టును మరింత గడువు కోరతారా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డితో పాటు మరో ఒకరిద్దరిపై ఇవాళ లేదా వారం, పది రోజుల్లో ఛార్జిషీట్ వేసే అవకాశం ఉంది.