డ్రగ్స్ పార్టీకి స్నేహితులను ఇంటికి పిలిచి మాదక ద్రవ్యాల మత్తులో కట్టుకున్న భార్యను చిత్రహింసలకు గురి చేశాడు కాకినాడకు చెందిన అఖిలేశ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్. స్నేహితులు భార్యతో రూడ్ గా ప్రవర్తించినా కూడా వారికి సహకరించమానేవాడు. దీనికి అతడి సోదరుడు కూడా ఒకే చెప్పడం బాధాకరం. దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బాధితురాలి భర్త, అతడి సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.