పులివెందులలో పాత మార్కెట్లో వెలసిన ఆంజనేయ స్వామికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. శనివారం ఉదయం అభిషేకాలు, విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి కాయ, కర్పూరం సమర్పించి పూజలు, అభిషేకాలు చేయించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. ఆలయ నిర్వహణ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.