తాడేపల్లిగూడెం మండలం చిన్న తాడేపల్లి గ్రామంలో జగన్నన సురక్ష కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ.. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ధ్రువపత్రాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.