నరసరావుపేట పట్టణంలో లయన్ పెనుగొండ వెంకటేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో త్వరలో ఆర్యవైశ్య విద్యార్థిని విద్యార్థుల ఉపకార వేతనాల కొరకు దరఖాస్తు ఫారం ను పెనుగొండ వెంకటేశ్వరరావు శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా పెనుగొండ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా ఆర్యవైశ్యులకు ఉపకార వేతనాలు అందజేయడం జరుగుతుందని ఇది 12వసారి ఇవ్వటం జరుగుతుందని తెలియజేశారు. పల్నాడు జిల్లా పేద మరియు మెరిట్ఆర్యవైశ్య విద్యార్థిని విద్యార్థులు 51 మందికి ఒక్కొక్కరికి మూడు వేలు చొప్పున ఈ స్కాలర్షిప్ కొరకు అర్హులని తెలియజేశారు.