చిలకలూరిపేట పట్టణంలో జగనన్న సురక్ష పథకం కార్యక్రమంలో భాగంగా శనివారం 24, 26 వార్డులకు సంబంధించి 16, 17 సచివాలయాల్లో జగనన్న సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు, స్పెషల్ ఆఫీసర్ జి వసంత బాబు , మున్సిపల్ చైర్మన్ షేక్. రఫాని, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ గోవిందరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట. రాజేంద్రప్రసాద్, స్టేట్ మైనార్టీ సెల్ డైరెక్టర్ దర్యావలి, తహసీల్దార్ జి. సుజాత , మున్సిపల్ డిఈ రమణ, మున్సిపల్ టిపిఎస్ సునీత, 24 వ వార్డు కౌన్సిలర్ షేక్ కరీముల్లా, 26వ వార్డు కౌన్సిలర్ సిహెచ్ భారతి, సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.