బూటకపు మాటలతో, అభివృద్ధిని గ్రాఫిక్స్‌లో చూపుతూ మేనిఫెస్టోను పూర్తిగా విస్మరించి ప్రజల్ని నట్టేట ముంచిన టీడీపీ నేతలు పదవీకాంక్షతో నేడు పచ్చి అబద్ధాలు మాట్లాడడం సిగ్గుచేటని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు ధ్వజమెత్తారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల్ని మోసపూరిత మాటలతో మభ్యపెట్టి దోచుకునే టీడీపీ పార్టీకి మేనిఫెస్టోపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు.