గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామం కళ్యాణ మండపంలో శనివారం జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బివి మల్లేశ్వరరావు, ఎంపీపీ తుళ్ళిమిల్లి శ్రీనివాసరావు , జడ్పిటిసి గొళ్ల జ్యోతి సచివాలయ సిబ్బంది పాల్గొని జగనన్న సురక్ష కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన ఆర్జిలను సత్వర పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు 11 రకాలైనా సేవలను ప్రభుత్వం ఉచితం అందిస్తుంది.