రాజకీయాలకు పనికిరాని వ్యక్తి పవన్ కల్యాణ్ అని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సీఎం వైయస్ జగన్ లాంటి వీరుడిని రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ ఏమీ చేయలేడన్నారు. ప్రాణాలకు తెగించాను.. తెగించాను అని మాట్లాడుతున్నాడని, రాజకీయాల్లో ప్రాణాలకు తెగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పెత్తందార్లు, చంద్రబాబు, లోకేష్‌ల పల్లకీని భుజాన మోస్తున్న పవన్‌కు.. పోరాటం గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు.