ఢిల్లీలోని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఢిల్లీలోని పరిపాలన నియంత్రణకు సంబంధించి తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పక్కన పెడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఈ ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చిందని ఆరోపించారు.