ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా సోందేపల్లిలో శనివారం విషాదం నెలకొంది. సాయినగర్ లో ప్రమాదవశాత్తు నీళ్ల బకెట్ లో పడి రెండేళ్ల చిన్నారి చరిత మృతి చెందింది. ఇంటి పక్కనే ఉన్న పెద్ద బకెట్ లో బట్టలు ఉతకడానికి చిన్నారి తల్లి నీళ్లు ఉంచింది. బట్టలు ఉతకడం ఆపి వేరే పని మీద తల్లి వెళ్లినప్పుడు ఆ చిన్నారి ఆడుకుంటూ బకెట్ లో జారి పడింది. ఎవరూ గమనించక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో చిన్నారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.