నాగార్జున నగర్(సత్తెనపల్లి) రోటరీ డిస్ట్రిక్ట్ 3150 ద్వారా 2022-23 సంవత్సరానికి గాను క్లబ్ ద్వారా చేసిన సేవా కార్యక్రమాలకు రోటరీ క్లబ్ ఆఫ్ సత్తెనపల్లికి 6 అవార్డులు రావడం జరిగింది. స్మాల్ క్లబ్స్ కేటగిరీలో మొదటి స్థానాన్ని, పర్యావరణ పరిరక్షణ, బాలికలకు సైకిల్ పంపిణీ, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి కుటుంబ ఆసరాకు ఉపయోగపడే విధంగా కుట్టుమిషన్ల పంపిణీ, మంచినీటి వసతి లేని ప్రాంతాల్లో రెండు బోర్ వెల్స్ ఏర్పాటు చేయడం, పేద విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం. శనివారం వికలాంగులకు ట్రై సైకిల్ పంపిణీ మొదలైన కార్యక్రమాలకు గాను రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ తాళ్ల రాజశేఖర్ రెడ్డి చేతుల మీదగా ఈ అవార్డు అందుకోవటం జరిగిందని రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ పాయసం మహేష్ బాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ జిల్లా సమన్వయకర్త బెల్లంకొండ నాగసాయి ప్రసాద్, ఫాస్ట్ ప్రెసిడెంట్ బాపతు శ్రీనివాసరెడ్డి, మాతంగి సాంబశివరావు, సరికొండ రమాదేవి, ధారా జాషువా, పెరుమాళ్ల లక్ష్మి శివ నారాయణ, చందోలు వెంకట మల్లికార్జునరావు, షేక్ సుభాని పాల్గొనడం జరిగింది.