హాస్పిటల్లో అభివృద్ధి కమిటీ డైరెక్టర్ కొత్త రామకృష్ణ ఆధ్వర్యంలో శనివారం డాక్టర్స్ డే పురస్కరించుకుని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సమక్షంలో స్థానిక గవర్నమెంట్ హాస్పటల్లో డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ జరిగినవి. హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ కొత్త రామకృష్ణ మాట్లాడుతూ సమాజంలో ఎంతో పేరు పొందిన డాక్టర్లు కూడా ఈ సందర్భంగా సన్మానించాలని అదేవిధంగా ఈ గవర్నమెంట్ హాస్పటల్ లో పనిచేస్తున్న డాక్టర్లకి చిరు సత్కారం చేయాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలియజేశారు. ముఖ్య అతిథి డాక్టర్ షకీలా శ్రీధర్ మాట్లాడుతూ ఒకప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పటల్ ఎంతో వ్యత్యాసం ఉందని కమిటీ సభ్యులు ఎంతో సేవా దృక్పథంతో పనిచేస్తున్నారని అందులో ముఖ్యంగా కొత్త రామకృష్ణ సేవలో విలువ కట్టలేని వి అని కొనియాడారు.
మరో ముఖ్యఅతిథి చల్లా నాగరాజా రెడ్డి మాట్లాడుతూ కార్డియాలజి సంబంధించి అవసరమైన ఉచిత సేవలందించడానికి మేము సిద్ధంగా ఉంటానని అదేవిధంగా ఈరోజు హాస్పటల్ అభివృద్ధి కమిటీ చేతుల మీదుగా ఈ చిరు సత్కారం అందుకోవటం ఎంతో అదృష్టం అని తెలియజేశారు. మరో ముఖ్య అతిథి డాక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ సొంత ఊరికి సేవ చేయడానికి ఇదొక గొప్ప వరం హాస్పిటల్ లో నిరుపేదలకు అవసరమైన వారికి ఉచిత సేవలు అందిస్తానని తెలియజేశారు అంబటి రాంబాబు మాట్లాడుతూ డాక్టర్స్ డే రోజు ఇలా ఘనంగా డాక్టర్ని సన్మానించడం ఎంతో మంచి కార్యక్రమం అని అదేవిధంగా ఈ గవర్నమెంట్ లో విద్యా వైద్యం మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి నిరుపేదలకు అండగా ఉంటుందని తెలియజేశారు.