పంది మీద ఊరేగుతున్న ఓ పిచ్చికుక్క పవన్ అంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. భీమవరంలో నిన్న పవన్ చేసిన వ్యాఖ్యలకు అంబటి కౌంటర్ ఇస్తూ.. వారాహి పైకి ఎక్కి చిందులు వేస్తూ ప్రాణాలకు తెగించానని చెప్తున్నాడని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ ల పల్లకీలు మోస్తున్న పవన్ కు విప్లవం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. గోదావరి జిల్లాలో జనసేనను చంద్రబాబుకు అమ్మేశాడన్న అనుమానం ఉందన్నారు.