మహారాష్ట్రలో జరిగిన ఘోర బస్సు అగ్నిప్రమాదంలో 26 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ప్రధానమంత్రి నరేంద్రమోదీలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల బంధువులకు సీఎం ఏక్నాథ్ షిండే రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే పీఎం సహాయనిధి నుంచి మృతులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు ప్రకటించారు.