ఒడిశా రైలు ప్రమాదం జరిగి నెలరోజులు కావస్తున్నా, మృతదేహాల గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఇంకా 76 మృతదేహాలు మార్చురీలోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. వీటిని భువనేశ్వర్ ఎయిమ్స్ లో భద్రపరిచినట్లు వెల్లడించారు. ‘డీఎన్ఏ పరీక్షల ద్వారా 29 మృతదేహాలను గుర్తించాం. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాం. ఇంకా 52 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది.’ అని పేర్కొన్నారు.