రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కర్ణాటక రాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. జూలై 2న 18వ స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేస్తామని వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ శరణప్ప వీ హళస తెలిపారు. ఆమె హాజరుకాని పక్షంలో 3న రాజ్‌భవన్‌లో ప్రదానం చేస్తామన్నారు. ఉపాధ్యాయురాలిగా జీవనాన్ని ప్రారంభించిన ఆదివాసీ మహిళ అత్యున్నతమైన రాష్ట్రపతి పదవి చేపట్టడంతో గౌరవ డాక్టరేట్ ప్రకటించామన్నారు.