యూపీలోని సంభాల్ జిల్లాలో సరయాత్రిన్ కు చెందిన యువకుడికి, రాజ్ పురాకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. జూన్ 27న సాయంత్రం వరుడు ఊరేగింపుగా కల్యాణ మండపానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో డీజే సంబరాలతో వధువు తరఫు వారు డ్యాన్సులు చేశారు. బంధువులతో పాటు వధువు తల్లి కూడా సిగరెట్ తాగుతూ డ్యాన్స్ చేసింది. దీన్ని చూసిన వరుడు షాకై పెళ్లి రద్దు చేసుకున్నాడు. ఈ నిర్ణయం ఇరు కుటుంబాల మధ్య ఘర్షణకు దారి తీసింది.