డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఆలమూరు మండలం మడికి అంతర్రాష్ట్రీయ కూరగాయల మార్కెట్‌తో పచ్చిమిర్చి ఘాటెక్కిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్కెట్లో 10 కిలోల పచ్చిమిర్చి బస్తా రూ.1,550 పలికింది. శుక్రవారం 10 కిలోల బస్తా రూ.950 ఉండగా.. శనివారం నాణ్యమైన పచ్చిమిర్చి మార్కెట్‌కు వచ్చింది. దాంతో ధర భారీగా పలికింది.