ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రైతుల ఖాతాల్లో రూ. 210 కోట్ల క్రాప్ ఇన్సూరెన్సు డబ్బులను జమ చేయనున్నట్లు తెలిపింది. ఈనెల 8న సీఎం జగన్ అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో పర్యటించి, రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. లబ్ధిదారుల జాబితాను ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించారు. జులై 3 వరకు అభ్యంతరాలు స్వీకరించి, తుది జాబితాను ప్రకటించనున్నారు.