గజపతినగరం మండలంలోని కాలం రాజుపేట గ్రామంలో శనివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు లక్షల ఆస్తి నష్టం సంభవించింది. గ్రామానికి చెందిన మిత్తిరెడ్డి చిట్టిబాబుకు చెందిన పూరిల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంటిలో గల వస్తువులన్నీ కాలిపోయాయి. ఈ మేరకు రెవెన్యూ సిబ్బందికి సమాచారాన్ని అందజేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.