గంట్యాడ మండల కేంద్రము కొటారుపల్లి జంక్షన్ లో గల ఎరువులు, పురుగుల మందుల దుకాణాలను వ్యవసాయ సహాయ సంచాలకులు విజయ అధ్వర్యంలో శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనకి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా స్టాక్ రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడం, రైతులకు బిల్లులు ఇవ్వకుండా అమ్మకాలు చేయడం వంటి ఉల్లంఘనలు ను గుర్తించామన్నారు. ధరల పట్టిక వివరాలను కనిపించే విధంగా దుకాణాల వద్ద ఏర్పాటు చేయాలన్నారు. ఈ తనిఖీల్లో మండల వ్యవసాయ అధికారి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.