దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో జగనరెడ్డి పూర్తిగా విఫలమైనట్లు టీడీపీ అనంతపురం జిల్లా ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు మల్లికార్జున పేర్కొన్నారు. శనివారం రాయదుర్గం పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....... జగనరెడ్డి అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల కాలంలో దళితులపై రోజు రోజుకు దాడులు ఎక్కువవుతున్నాయన్నారు. దళితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మానుకోవాలన్నారు. 2024 సాధారణ ఎన్నికలలో జగన రెడ్డికి గట్టిగా బుద్ధి చెబుదామని, ఎస్సీలంతా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీసెల్ అధికార ప్రతినిధి, అంజి, మండల క్రిస్టియన కమిటీ అధ్యక్షుడు మల్లేష్, టీఎనటీయూసీ, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఆనంద్, సీనియర్ నాయకులు చిన్నిక్రిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.