దేశంలో వివిధ ప్రాంతాల ప్రజల జీవనవిధానాలు, స్థితిగతులను, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రత్యక్షంగా చూడాలన్న లక్ష్యంతో సైకిల్‌పై దేశయాత్ర చేపట్టిన యువకుడు శనివారం కందుకూరు చేరుకున్నారు. కందుకూరు నియోజకవర్గంలోని కొండసముద్రంకి చెందిన న్యాయవాది బీఎస్ నారాయణమూర్తి కుమారుడు వెంకట్ సైకిల్‌పై దేశయాత్రకు బయలుదేరాడు. గుజరాత్‌లో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వెంకట్ ఇప్పటికే ఉత్తరాది యాత్ర పూర్తిచేసి దక్షిణభారతంలో తన యాత్రను ప్రారంభించాడు. కందుకూరు చేరిన సందర్భంగా వెంకట్ తన కుటుంబ సభ్యులతోపాటు ఎమ్మెల్యే మహీధరరెడ్డిని కలిసి యాత్ర విశేషాలను వివరించాడు. ఈ సందర్భంగా వెంకట్‌ను ఎమ్మెల్యే అభినందించారు. వెంకట్ మాట్లాడుతూ రోజుకి 100 కిలోమీటర్లకు తక్కువ కాకుండా సైకిల్‌యాత్ర చేస్తున్నానని తెలిపాడు. యాభైరోజుల్లో ఉత్తరభారతదేశ యాత్ర పూర్తయిందన్నారు. ఎక్కడికక్కడ స్థానికులు ఎంతగానో సహకరించారని తెలిపారు.
![]() |
![]() |