ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల వద్ద నుండి అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని శృంగవరపుకోట జూనియర్ సివిల్ జడ్జి సబ్బవరపు వాణి అన్నారు. శృంగవరపుకోట పట్టణంలో గల ఓ విద్యా సంస్థ మొదట నిర్దేశించిన ఫీజు కంటే అధికంగా వసూలు చేశారని పట్టణానికి చెందిన పి. రమణబాబు అనే వ్యక్తి శనివారం మండల న్యాయ సేవాధికార సంస్థకు దరఖాస్తును అందజేసారు. ఈ మేరకు ప్రైవేటు పాఠశాల యాజమాన్యానికి కోర్టు నోటీసులు ద్వారా పిలిపించి, సమస్యను అడిగి తెలుసుకుని, రాజీమార్గంలో పరిష్కారం చూపారు. ఈ నేపథ్యంలో ఫీజుల రూపంలో అధికంగా వసూలు చేసిన డబ్బులును రమణబాబుకు ఇప్పించారు.