ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పుడొక మాట, ఇప్పుడొక మాటనా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 02, 2023, 12:30 PM

చిత్తూరు విజయ డెయిరీని తక్కువ లీజుకు అమూల్‌ సంస్థకు అప్పగించడం దారుణమని మాజీ ఎమ్మెల్సీ దొరబాబు అన్నారు. సీఎం జగన్‌ తన కేసులను మాఫీ చేసుకోవడం కోసమే విజయ డెయిరీని అమూల్‌ సంస్థకు అప్పగించారని ఆరోపించారు. కోట్లాది రూపాయల విలువచేసే డెయిరీని వైసీపీ ప్రభుత్వం తక్కువ ధరకే లీజుకు ఇవ్వడం బాధాకరమని చెప్పారు. ప్రభుత్వమే రైతుల భాగస్వామ్యంతో డెయిరీని నడిపి ఉండాల్సిందన్నారు. జగన్‌ తన పాదయాత్రలో విజయ డెయిరీని పునఃప్రారంభిస్తామని చెప్పి.. ఇప్పుడిలా చేయడం దురదృష్టకరమని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com