ఇటీవల పదోన్నతులు పొంది ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ హోదాలో పని చేస్తున్న ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అర్హత గల సబ్జెక్టులను బట్టి స్కూల్ అసిస్టెంట్లుగా కన్వర్షన్కు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఏజీఎస్ గణపతిరావు, ప్రధాన కార్యదర్శి కె.ప్రకాశరావు విద్యాశాఖ మంత్రికి, ఆ శాఖ ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.