‘‘రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్షం ఉండకూడదని జగన్ ఉద్దేశ్యమా? అడుగడుగునా చంద్రబాబు కదలికలకు అడ్డంకులు కలిగిస్తుంది అందుకేనా? అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. ఆయన అద్దెకు ఉంటున్న ఇళ్లు జప్తు అయితే... ఆ గొడవ ఇంటి యజమాని లింగమనేని రమేశ్, ప్రభుత్వం మధ్య ఉండాలి. కానీ అందులోకి చంద్రబాబును ఎందుకు లాగుతున్నారు? చంద్రబాబు కుప్పంలో నూతన గృహ నిర్మాణానికి అనుమతి ఇవ్వకుండా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఆయన ఇల్లు కట్టుకోవడం జగన్‌రెడ్డికి ఇష్టం లేదా? తాడేపల్లిలో జగన్ ఇల్లు కట్టుకుంటానంటే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఆగమేఘాలపై అనుమతులు ఇచ్చారే. మరి మీరెందుకు చంద్రబాబుకు అనుమతులివ్వరు? చంద్రబాబుకు ఇల్లు లేకుండా, కట్టుకోవటానికి అనుమతివ్వకుండా, ఆయన్ని రోడ్డున పడేద్దామంటున్నారా? ప్రభుత్వంలోని వారు ఎన్ని కుట్రలు చేసి చంద్రబాబుకు ఇల్లు లేకుండా చేసినా... ప్రస్తుతం ఉంటున్న ఇంటి నుంచి బయటకు పంపినా... ఆయన కోట్లాది ప్రజల గుండెల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారన్న విషయాన్ని వైసీపీ నేతలు గమనించాలి’’ అని వర్ల అన్నారు.