బంగాళాఖాతంలో భారత్‌ఫ్రాన్స్ నౌకలు సందడి చేశాయి. మారిటైమ్ పార్ట్‌నర్‌షిప్ ఎక్సర్‌సైజ్ (ఎంపీఎక్స్)లో భాగంగా జూన్ 30న భారత నౌకాదళానికి చెందిన క్షిపణి విధ్వంసక నౌక రాణా, స్వదేశీయంగా రూపొందించిన పెట్రోలింగ్ నౌక సుమేధ.. ఫ్రాన్స్‌కు చెందిన సర్‌కౌఫ్ నౌకతో కలిసి విన్యాసాలు చేపట్టాయి. ఫ్రెంచ్ నేవీకి చెందిన సర్‌కౌఫ్ నౌక ఇటీవల విశాఖపట్నం చేరుకుందని, భారత నేవీకి చెందిన రాణా, సుమేధ నౌకలతో కలిసి వివిధ కార్యకలాపాల్లో పొల్గొందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రెండు నౌకా దళాల మధ్య సన్నిహిత స్నేహాన్ని పునరుద్ఘాటిస్తూ సర్‌కౌఫ్‌కు శుక్రవారం సంప్రదాయ వీడ్కోలు పలకడంతో ఎంపీఎక్స్ ముగిసిందని భారత నేవీ తెలిపింది. కాగా, ఈ ఏడాది మార్చిలోనూ ఫ్రాన్స్‌కు చెందిన మూడు యుద్ధ నౌకలు భారత నేవీతో కలిసి ఎంపీఎక్స్‌లో పాల్గొన్నాయి.