జీవో నెంబర్ 52 రద్దు చేయకపోతే దేశవ్యాప్త పోరాటాలకు శ్రీకారం చుడతామని లంబాడా హక్కుల పోరాట సమితి (ఎల్హెచపీఎస్) జాతీయ నాయకుడు మూడే శంకర్‌నాయక్ హెచ్చరించారు. శనివారం రాయచోటి పట్టణంలోని అంబేడ్కర్ ప్లె క్సీ వద్ద నివాళులు అర్పించి కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల కాలంలో గిరిజనుల సంక్షేమానికి ఒక్క కార్యక్రమం అమలు చేసిన పాపాన పోలేదన్నారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు రామాంజులు, నాస్తిక సమాజం రాయలసీమ కన్వీనర్ పల్లం తాతయ్య, పౌర హక్కుల నాయకులు అడ్వకేట్ రెడ్డెయ్య, గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు విశ్వనాఽథనాయక్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, మహిళా హక్కుల పోరాట సమితి ఝాన్సీ, వడ్డెర విద్యావంతుల వేదిక నాయకులు పాల్గొన్నారు.