చంద్రబాబుకు బానిసగా పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నాడని, ఏ క్లాస్ వారితో అంటకాగుతున్నావు..? ఏ క్లాస్ వ్యక్తుల దగ్గర ప్యాకేజీ తీసుకున్నావు..? గతంలో ఓడిపోయిన రెండుచోట్లా ఎన్నికల ఖర్చును ఏ క్లాస్ వారి దగ్గర్నుంచి తీసుకున్నావు..? అని పవన్ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేష్ ప్రశ్నించారు. వారాహి పేరుతో లారీ ఎక్కి తిరుగుతూ.. సభ జరిగినచోటల్లా ఒక వీధిరౌడీలా, ఆకురౌడీలా మాట్లాడుతున్నాడని, పవన్ పలికే భాష, వ్యవహరించే తీరును గమనిస్తే అతను కచ్చితంగా ఆకురౌడీ కాగలడేమో గానీ ఎమ్మెల్యేగా మాత్రం గెలవలేడన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ నందిగం సురేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు.