ప్రజల వినతులను సంతృప్త స్థాయిలో పరిష్కరించడం, ఏ ఒక్కరూ మిగిలిపోకుండా అర్హులందరికీ వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి అనుబంధంగా చేపట్టిన ‘జగనన్న సురక్ష’ ద్వారా నిన్నటి నుంచి సచివాలయాలవారీగా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం ప్రారంభమైంది. సమస్యలు పరిష్కరించి లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేస్తున్నారు. లబ్ధిదారులకు సర్టిఫికెట్లు ప్రజాప్రతినిధులు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోంది.