భీమవరం సభలో పవన్ కల్యాణ్ వీధి రౌడీలా ప్రవర్తించాడని, పిచ్చికుక్కలా స్వైరవిహారం చేశాడని, రాజకీయాలకు పనికిరాని వ్యక్తి పవన్ కల్యాణ్ అని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఒంటి చేత్తో 150 మందిని గెలిపించిన సీఎం వైయస్ జగన్ లాంటి వీరుడిని రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ ఏమీ చేయలేడన్నారు. ప్రాణాలకు తెగించాను.. తెగించాను అని మాట్లాడుతున్నాడని, రాజకీయాల్లో ప్రాణాలకు తెగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పెత్తందార్లు, చంద్రబాబు, లోకేష్‌ల పల్లకీని భుజాన మోస్తున్న పవన్‌కు.. పోరాటం గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. సీఎం వైయస్ జగన్ గురించి అంతా తెలుసు అని మాట్లాడే పవన్ ఒక పుస్తకం రాసి ఆవిష్కరిస్తే ప్రజలంతా చదువుతారు కదా అని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.