ఆంధ్రప్రదేశ్ 175/175 అని తరచుగా చెబుతోన్న సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటనలు ఎంత మాత్రం అతిశయోక్తి కాదంటున్నాయి తాజా సర్వేలు. ప్రముఖ జాతీయ మీడియా టైమ్స్ నౌ నవభారత్ చేపట్టిన సర్వేలో ఈ విషయం తేటతెల్లమయింది. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగితే..వైయస్ఆర్ సీపీ భారీ విజయాన్ని సాధిస్తుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్ సభ స్థానాలున్నాయి. ఈ లోక్ సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే.. 25కు 24 లేదా 25 వస్తాయని సర్వే తెలిపింది. ప్రతిపక్షంలో ఉన్న తెలుగు దేశం పార్టీకి 0-1 స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని, ఆ పార్టీకి అంతకంటే మించి అవకాశం లేదని తెలిపింది.