మహారాష్ట్ర రాజకీయాల్లో ఆదివారం ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ పార్టీలో 30 మంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకున్నారు. వారితో కలిసి ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ-శివసేన కూటమిలో చేరనున్నారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పదవి లేదా ఆర్థిక మంత్రి పదవిని అజిత్ పవార్ చేపట్టే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేసే వీలుంది.