కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినప్పటి నుంచి ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంది. ఇటీవల చాలా అనూహ్య ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రయాణికుల మధ్య గొడవలు, కండెక్టర్లతో వివాదాలు ఇలా చాలానే జరుగుతున్నాయి. తాజాగా మరోసారి మహిళలు సీటు కోసం ఘోరంగా కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.