మణిపూర్ అల్లర్లపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. మణిపూర్లో హింసకు ఆజ్యం పోయడంలో చైనా ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. చైనాపై కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్రంలోనూ, ఈశాన్య రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలో ఉందని, మే 3 నుంచి అక్కడ అల్లర్లు జరుగుతుంటే ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. అల్లర్లు ఎవరి ముందస్తు ప్రణాళికో తేల్చాలన్నారు.