పొన్నూరు పట్టణం అంబేద్కర్ సెంటర్లో ఆదివారం అర్బన్ సిఐ ఎం బాబి ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేపట్టారు. లైసెన్స్ లేని, త్రిబుల్ రైడింగ్ , 'ఈ' చలానా చెల్లించని వారి వాహనాలను గుర్తించి అపరాధ రుసుం విధించారు. అనంతరం సిఐ బాబి మాట్లాడుతూ గతంలో' ఈ' చలానాలు చెల్లించని వారికి అధికంగా అపరాధరుసుం విధిస్తామని త్వరగా 'ఈ' చలానాల చెల్లించాలని పేర్కొన్నారు. అలానే మద్యం సేవించి వాహనాల నడపరాదని తప్పనిసరిగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించాలని సూచించారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలని వాహనదారులకు అవగాహన కల్పించారు.