పొన్నూరు మండల తాసిల్దార్ కార్యాలయంలో నేడు సోమవారం యధావిధిగా స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల తాసిల్దార్ శ్రీకాంత్ కేదార్నాథ్ తెలిపారు. పొన్నూరు మండల పరిధిలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో స్పందన కార్యక్రమంలో అందించాలని ఆయన కోరారు. సమస్యలు సత్వరమే పరిష్కరించేందుకు స్పందన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు.