రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్ణాటక పర్యటన కోసం సోమవారం బెంగళూరు వచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ థాపర్ చంద్ గెహ్లాట్, సీఎం సిద్ధరామయ్య ఆమెకు ఘనస్వాగతం పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారిగా ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు.