దక్షిణ మధ్య రైల్వే అధికారులకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. ఒడిశాలోని బాలాసోర్‌లో గత నెలలో జరిగిన ఘోర రైలు ప్రమాదం తరహాలో ఈ రైలు ప్రమాదం త్వరలో జరగనుందని ఓ ఆగంతకుడు హెచ్చరించాడు. హైదరాబాద్-ఢిల్లీ మార్గంలో రైలు ప్రమాదం జరుగుతుందని తన లేఖలో పేర్కొన్నాడు. ఈ లేఖ గత వారమే అందినట్లు తెలుస్తోంది. తాజాగా ఆ లేఖపై రాష్ట్ర పోలీసులకు రైల్వే అధికారులు సమాచారం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa