మాధవధార గ్రామ ప్రజల ఇల వేల్పు శ్రీ కుంచుమాంబ అమ్మ పండగను మంగళవారం ఘనంగానిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సోమవారం తొలేళ్ల ఉత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఉరేగింపుతో కిలోమీటరు దూరంలో ఉన్న సదరం పట్టు వద్ద ఏర్పాటు చేసిన ఆలయంలో ఘటాలను ప్రతిష్ఠించారు. అమ్మవారి పూల ఘటాలను ఇంటింటికీ ఊరేగింపు నిర్వహిస్తామని పూజారులు తెలియజేశారు.