జాతీయ రహదారి సీతన్నగార్డెన్స్ సేవా రహదారికి ఆనుకొని ఉన్న కాలువ మంగళవారం పొంగిపోవడంతో మురుగునీ రంతా సేవా మార్గం గుండా ప్రవహించింది. ఈ కాలువకు అనుసంధా నంగా ఉన్న అవతల వైపు గెడ్డ పూర్తిగా వ్యర్థాలతో నిండిపోవడంతో, ప్రతి రోజు కాలువ నిండిపోయి ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సేవా మార్గం గుండా ప్రవహిస్తోంది. తీవ్ర దుర్వాసన వెదజల్లు తుండటంతో రాకపోకలు సాగించే చోదకులు, పాదచారులు ముక్కు మూసుకొని ప్రయాణాలు సాగిస్తున్నారు. తక్షణమే జీవీఎంసీ అధికారులు స్పందించి కాలవకు అనుసంధానమైన గెడ్డను శుభ్రం చేసి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని పలువురు ప్రజలు కోరుతున్నారు.